చిత్తూరులో నామినేషన్ల జోరు

చిత్తూరు నగరపాలక సంస్థ ఎన్నికల్లో నామినేషన్ల జోరు కొనసాగింది. మేయర్ పదవి, 60 వార్డులకు మొత్తం 620 నామినేషన్లు దాఖలయ్యాయి. మేయర్ పదవికి 14, వార్డు సభ్యుల స్థానాలకు 606 నామినేషన్లు వచ్చాయి. మేయర్ పదవికి టీడీపీ నుంచి 6, వైఎస్సార్‌సీపీ నుంచి 3, కాంగ్రెస్ నుంచి 1, స్వతంత్రుల నుంచి 4 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డులకు టీడీపీ 271, వైఎస్సార్‌సీపీ 177, జనసేన 37, బీజేపీ 19, ఇతర పార్టీలు, స్వతంత్రుల నుంచి 102 నామినేషన్లు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.



