దుబ్బ రాజీవ్ నగర్‌లో బతుకమ్మ వేడుకలు

నిజామాబాద్ నగరంలోని దుబ్బ రాజీవ్ నగర్ కాలనీ 17వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. సమాచార హక్కు మహిళా అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో స్థానిక మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయ ఆటపాటలతో సందడి చేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా సాగిన ఈ వేడుకలతో కాలనీలో పండుగ వాతావరణం నెలకొంది.



