పలమనేరు టీడీపీ చైర్‌పర్సన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మి

చిత్తూరు జిల్లాలోని పలమనేరు మున్సిపల్ చైర్‌పర్సన్ అభ్యర్థిగా రాజ్యలక్ష్మిని టీడీపీ అధిష్ఠానం ప్రకటించింది. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఆమె పేరును ఖరారు చేసింది. గతంలో రాజ్యలక్ష్మి వైస్ ఎంపీపీగా, కౌన్సిలర్‌గా, కో-ఆప్షన్ సభ్యురాలిగా పనిచేశారు. ప్రస్తుతం చైర్‌పర్సన్ అభ్యర్థిగా ఆమెను ఎంపిక చేయడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.



