← Back to news

దసరా సెలవులతో అరకులోయ కిటకిట

By B V Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju

దసరా సెలవులతో అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయకు పర్యాటకుల తాకిడి పెరిగింది. శనివారం గిరిజన మ్యూజియాన్ని సుమారు 3,500 మంది సందర్శించడంతో సందడి నెలకొంది. గిరిజనుల సంస్కృతి, జీవన విధానాన్ని ప్రతిబింబించే కళాకృతులు పర్యాటకులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్నవారు అక్కడి ప్రదర్శనలను చూసి తమ చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

More in Local