← Back to news

బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శం : MLA

By BK· 2h ago· సంగారెడ్డి
బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శం : MLA

సంగారెడ్డి పట్టణంలోని పోతిరెడ్డిపల్లిలో కౌన్సిలర్ పొన్న దశరథ్ రెడ్డి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై రంగురంగుల పూల బతుకమ్మలతో సందడి చేశారు. ఈవెంట్‌కి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ గెస్ట్‌గా హాజరయ్యారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ ప్రపంచానికే ఆదర్శమని ఆయన అన్నారు. ప్రోగ్రామ్ ఏర్పాట్లు చేసిన కౌన్సిలర్‌ను అభినందించారు.

More in Local