ZPTC, MPTC ఎన్నికలపై సీపీఎం ఫోకస్

అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ బిల్లపూట్ గ్రామంలో ఆదివారం సీపీఎం బృందం పర్యటించింది. పార్టీ నాయకులు, కార్యకర్తలతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించింది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ZPTC, MPTC అభ్యర్థులను గెలిపించాలని CPM మండల నాయకుడు, మాజీ ఉపసర్పంచ్ పాంగి సత్యనారాయణ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి ఎస్వీ పోతురాజు, పాంగి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.



