GSR ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు
కొత్తగూడెం జిల్లా కేంద్రంలో GSR ట్రస్ట్ ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. జనసేన పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ, వరంగల్–ఖమ్మం–నల్గొండ ఎమ్మెల్సీ అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరుగుతున్న వేడుకల్లో భాగంగా శనివారం వెన్న ముద్దల బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించిన మహిళలు సంప్రదాయ పాటలు పాడుతూ ఆటపాటలతో సందడి చేశారు. జనసేన కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలు మహిళల్లో పండుగ ఉత్సాహాన్ని నింపాయి.



