← Back to news

రైతుబజార్ల కోసం ఎదురుచూపులు

By BK· 7h ago· బాపట్ల
రైతుబజార్ల కోసం ఎదురుచూపులు

చీరాల, రేపల్లె ప్రజలకు తక్కువ రేటుకు ఫ్రెష్ వెజిటెబుల్స్ అందేలా రైతుబజార్లు పెట్టడంలో లేట్ అవుతోంది. మార్కెట్లో మధ్యవర్తుల దోపిడీతో జనం రేట్లు భరించలేకపోతున్నారు. జిల్లాలో కూరగాయలు బాగా పండినా, బాపట్లలో 2019లో కట్టిన రైతుబజార్ గత ప్రభుత్వంలో మూలనపడింది. కూటమి సర్కార్ వచ్చాక 2024 డిసెంబర్లో ఓపెన్ చేసినా, ఆఫీసర్ల నిర్లక్ష్యంతో మళ్లీ బోసిపోయింది. రోడ్లపైనే అమ్మకాలు సాగుతుండటంతో ట్రాఫిక్ జామ్ అవుతోంది. మున్సిపల్ ఎలక్షన్ల తర్వాతైనా కొత్త లీడర్లు స్పందించి వీటిని బాగు చేయాలని ప్రజలు కోరుతున్నారు.

More in Local