← Back to news

బూత్ నం.209పై హైకోర్ట్ ఆదేశాలను అమలు చేయాలి

By SHAIK SUBHANI· 1d ago· Palnadu
బూత్ నం.209పై హైకోర్ట్ ఆదేశాలను అమలు చేయాలి

పల్నాడు జిల్లా రొంపిచర్ల మండలకేంద్రంలోని పోలింగ్ బూత్ నం.209ను యథావిధిగా కొనసాగించాలంటూ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను వెంటనే అమలు చేయాలని వైసీపీ పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బూత్ పరిధిలోని 786 ఓట్లలో 650 ఓట్లు SC, ST, BC వర్గాలకు చెందినవని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థుల నామినేషన్లను అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

More in Local