జాకారం చెరువుకు దేవాదులను అనుసంధానించాలి'

ములుగు జిల్లా ములుగు మండలం జాకారం ఊర చెరువు అడుగంటడంతో మరో నెల రోజులు మాత్రమే సాగునీరు అందేపరిస్థితి ఉందనిరైతులు ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. దీంతో సుమారు 800 ఎకరాల ఆయకట్టు ఎండిపోయే ప్రమాదంఉందని తెలిపారు. ఎల్నినో ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న రైతులు, 2కిలోమీటర్ల దూరంలోఉన్న దేవాదుల పైపులైను చెరువుకు అనుసంధానించాలని ప్రజావాణిలో కోరినా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు.



