పర్యాటక మార్గంలో పొంచి ఉన్న ప్రమాదం
అల్లూరి సీతారామరాజు జిల్లా అరకులోయ మండల కేంద్రం నుంచి చొంపి వెళ్లే మార్గంలోని కొత్తవలస ఆర్చ్ ముందు మ్యాన్ హోల్ పైకప్పు పగిలి నెలలుగా గుంత ఏర్పడింది. ప్రమాద హెచ్చరికగా కర్రకు క్లాత్ కట్టి ఉంచినా ముప్పు తప్పడం లేదు. పర్యాటక వాహనాలు, ఆటోలు నిత్యం తిరిగే ఈ మార్గంలో ముఖ్యంగా రాత్రివేళ ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నారు.



