నవంబర్ 1న మాదిగ మహారాజుల శోభాయాత్ర

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నవంబర్ 1న నిర్వహించనున్న మాదిగ మహారాజుల శోభాయాత్ర ప్రచార కరపత్రాన్ని ధర్మ సమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జాగృతి సంఘం సభ్యులు ఇవాళ పాల్గొన్నారు. మాదిగ సమాజ ఆత్మగౌరవాన్ని చాటిచెప్పేలా శోభాయాత్రను నిర్వహించనున్నట్లు నాయకులు తెలిపారు. సమాజంలోని వారంతా ఐక్యంగా పాల్గొని యాత్రను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.



