← Back to news

పోలీసుల పహారాలో పులివెందుల

By Ram krishna· 1d ago· Y.S.R. Kadapa
పోలీసుల పహారాలో పులివెందుల

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో కడప జిల్లా పులివెందులలో పోలీసులు భద్రత కట్టుదిట్టం చేశారు. శనివారం నామినేషన్ల సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో ఆదివారం చివరి రోజు ఎలాంటి ఘటనలు జరగకుండా మూడు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇప్పటికే కడప MP వైఎస్ అవినాష్ రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. పట్టణంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు పహారా కొనసాగుతోంది.

More in Local