ఆదిశిల క్షేత్రంలో గద్వాల సీఐ ప్రత్యేక పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలంలోని ఆదిశిల క్షేత్రం శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని గద్వాల సీఐ టంగుటూరి శ్రీను కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్వామివారి శేష వస్త్రం, చిత్రపటాన్ని బహూకరించారు.



