మహా కూటమి ఆధ్వర్యంలో రేపు భారీ ధర్నా

TG: కేంద్ర ఎన్నికల సంఘం తీరును నిరసిస్తూ ఢిల్లీలో రేపు మహా కూటమి ఆధ్వర్యంలో మహా ధర్నా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, TPCC అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌తో కలిసి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ విషయాన్ని మంత్రి పొన్నం కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటనలో తెలిపారు.

