నేడు అటుకుల బతుకమ్మ

తెలంగాణలో బతుకమ్మ సంబరాలు ఊపందుకున్నాయి. పండుగలో రెండో రోజైన ఇవాళ అటుకుల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మకు పూజలు చేస్తారు. ఆటపాటలతో సందడి చేస్తూ పండుగ ఆనందాన్ని పంచుకుంటారు. ఈ రోజు గౌరమ్మకు అటుకులు, సప్పిడి పప్పు, బెల్లం నైవేద్యంగా సమర్పిస్తారు. అటుకులను ప్రధానంగా నైవేద్యంగా పెట్టడం వల్లే ఈ రోజుకు అటుకుల బతుకమ్మ అనే పేరు వచ్చింది.


