← Back to news

ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా? గ్రామస్తుల ఆవేదన

By ARJUN· 22h ago· Jogulamba Gadwal
ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా? గ్రామస్తుల ఆవేదన

జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల మండలం చెనుగోనిపల్లె గ్రామంలో పందులు, కుక్కల సంచారంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. వీధుల్లో అవి స్వేచ్ఛగా తిరుగుతుండటంతో చిన్నారులు, పాఠశాల విద్యార్థుల భద్రతపై తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కొన్ని కుక్కలు చర్మవ్యాధులతో బాధపడుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. పలుమార్లు ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరారు.

ఫిర్యాదులు చేసినా పట్టించుకోరా? గ్రామస్తుల ఆవేదన

More in Local