డేటా సెంటర్లతో లాభమెంత..

TG: హైదరాబాద్‌లో భారీ డేటా సెంటర్ల వల్ల ప్రజలకు, పర్యావరణానికి ఎలాంటి నష్టం జరుగుతుందనే దానిపై చర్చ మొదలైంది. శనివారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో నిపుణులు ఈ అంశంపై మాట్లాడారు. డేటా సెంటర్లకు భారీగా నీరు, కరెంట్ అవసరమవుతాయని, వీటివల్ల స్థానిక ప్రజలపై ఎలాంటి ప్రభావం పడుతుందో ముందే స్టడీ చేయాలని సూచించారు. పెద్ద ప్రాజెక్టులకు పర్మిషన్లు ఇచ్చే ముందు పర్యావరణ ప్రభావాన్ని అంచనా వేయాలని కోరారు. అభివృద్ధి పేరుతో ప్రజలకు, భవిష్యత్ తరాలకు నష్టం జరగకుండా చూడాలని అన్నారు.


