← Back to news

130 మండలాల్లో కరువు ప్రభావం

By A.Ajay· 22h ago
130 మండలాల్లో కరువు ప్రభావం

TG: వర్షాలు తక్కువగా పడటంతో 130 మండలాల్లో కరువు ప్రభావం ఉన్నట్లు ప్రభుత్వ ప్రాథమిక నివేదిక తెలిపింది. వీటిలో 20 మండలాల్లో తీవ్రత ఎక్కువగా, 110 మండలాల్లో సాధారణ స్థాయిలో ఉంది. జూన్‌ నుంచి సెప్టెంబరు వరకు సాధారణంగా 740.6 మిల్లీమీటర్లు వర్షం పడాల్సి ఉండగా, 615.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. దీంతో 17 శాతం వర్షపాతం లోటు ఏర్పడింది. కరువు ప్రాంతాలను గుర్తించేందుకు ప్రభుత్వం క్షేత్రస్థాయి సర్వే చేపట్టింది. ఈ నెల 31లోగా ప్రాంతాలను ఖరారు చేసి, కేంద్రం నుంచి సాయం కోరాలని ప్రభుత్వం భావిస్తోంది.

More in TG