← Back to news

ప్రాణాలు కాపాడిన హెల్మెట్

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal

వరంగల్ జిల్లా వర్ధన్నపేట అంబేడ్కర్ సెంటర్ వద్ద ఓ బైక్‌‌పై వెళ్తున్న వ్యక్తి ప్రమాదానికి గురయ్యాడు. హెల్మెట్ ఉండటంతో తలకు తీవ్ర గాయాలు కాకుండా ప్రాణాపాయం నుంచి త్రుటిలో బయటపడ్డాడు. ఈ యాక్సిడెంట్ సీన్స్ సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. హెల్మెట్ ప్రాణాలను కాపాడటంలో ఎంత కీలకమో ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ పెట్టుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.

More in Local