నర్సంపేటలో దసరా వేళ పెరిగిన పూల ధరలు
దసరా, బతుకమ్మ వేడుకల వేళ పూల ధరలు సామాన్యులకు భారంగా మారాయి. పండుగ పూజల నేపథ్యంలో పూలకు గిరాకీ పెరగడంతో ధరలు అమాంతం పెరిగాయి. సాధారణ రోజుల్లో కిలో బంతి పూలు ₹.50 ఉండగా, ప్రస్తుతం ₹.80 నుంచి ₹.100 వరకు విక్రయిస్తున్నారు. ధరలు పెరగడంతో మధ్యతరగతి కుటుంబాలు పూల కొనుగోలుకు వెనుకాడుతున్నాయి. పండుగ సమయంలో పూలు కొనాలంటే జేబుకు చిల్లు పడుతోందని వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలోని పలువురు మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.



