← Back to news

వందలాది మంది రాకపోకలు.. బస్టాప్ లేదు

By THOORPATI RAJASHEKAR· 1d ago· Warangal
వందలాది మంది రాకపోకలు.. బస్టాప్ లేదు

వరంగల్ జిల్లా నర్సంపేట ప్రభుత్వ ఆసుపత్రి, వైద్య కళాశాలకు నిత్యం వందలాది మంది రోగులు, వైద్య, నర్సింగ్ విద్యార్థులు రాకపోకలు సాగిస్తున్నారు. అయితే ఆసుపత్రిని ప్రారంభించినా ఇప్పటివరకు బస్టాప్ ఏర్పాటు చేయలేదు. దీంతో దూరప్రాంతాల నుంచి వచ్చే పేషంట్స్ తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించి ఆసుపత్రి, వైద్య కళాశాల సమీపంలో బస్టాప్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.

More in Local