← Back to news

37వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు

By Sravan Kumar· 6h ago· Peddapalli
37వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు

పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపాలిటీ 37వ డివిజన్‌లో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ ఎండీ మీర్జా ఫజల్ బేగ్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయబద్ధంగా వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా పండుగ విశిష్టతను చాటుతూ మహిళలు ఉత్సాహంగా బతుకమ్మ పాటలు పాడుతూ సంబరాల్లో పాల్గొన్నారు.

More in Local