కోటదుర్గమ్మ ఆలయంలో టికెట్ల తనిఖీ ఏదీ?
పార్వతీపురం మన్యం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలకు ఆదివారం భక్తులు భారీగా తరలివచ్చారు. రద్దీని నియంత్రించేందుకు ఆలయ అధికారులు మూడు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దర్శన టికెట్ల ధరలు ₹30, ₹100, ₹200గా నిర్ణయించగా, టికెట్ల తనిఖీ చేయకపోవడంపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. టికెట్ ఉన్నవారు, లేనివారు ఒకే వరుసలో దర్శనానికి వెళ్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే తనిఖీలు చేపట్టాలని కోరారు.



