భారీగా దెబ్బతిన్న స్టాక్ మార్కెట్స్

భారతీయ స్టాక్ మార్కెట్లు భారీగా దెబ్బతిన్నాయి. అంతర్జాతీయ పరిణామాలు, ముడి చమురు ధరల భయాల కారణంగా దలాల్ స్ట్రీట్లో ఈ పరిస్థితి నెలకొంది. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్(BSE) సూచీ సెన్సెక్స్ ఏకంగా 1,100కి పైగా పాయింట్లు నష్టపోగా, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) నిఫ్టీ 50 కీలక స్థాయిలను కోల్పోయింది. ఈ ఒక్క భారీ అమ్మకాల సునామీకి దాదాపు రూ. 7.41 లక్షల కోట్ల సంపద ఆవిరైపోయింది. రిటైల్ ఇన్వెస్టర్లు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.


