← Back to news

పెదవడ్లపూడిలో దుర్గామాతకు మహిళలు సారె సమర్పణ

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur
పెదవడ్లపూడిలో దుర్గామాతకు మహిళలు సారె సమర్పణ

గుంటూరు జిల్లా పెదవడ్లపూడిలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా గ్రామ గోమాత, గోశాల కన్వీనర్ పాతూరి శ్రీనివాసరావు, రాధిక దంపతుల ఆధ్వర్యంలో మహిళలు అమ్మవార్లకు సారె సమర్పించారు. గ్రామంలోని 18 అమ్మవారి మండపాలు, మూడు దేవాలయాల వద్దకు మేళతాళాలు, కనకతప్పెట్లు, కోలాటాలు, బాణసంచా నడుమ ఊరేగింపుగా చేరుకుని భక్తిశ్రద్ధలతో సారె అందించారు. గత 13ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని పాతూరి దంపతులు తెలిపారు.

More in Local