చెక్‌పోస్ట్‌పై ప్రశ్న.. పోలీసులు డిటైన్
సౌత్ ఢిల్లీలో నిన్న షోయబ్ తన ఇంటి బయట ట్యాక్సీ కోసం ఎదురు చూస్తున్న టైంలో పోలీసులు అతని ఇంటి ముందే రోడ్డుపై ప్రొటెస్ట్‌కు వెళ్లనికుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. అక్కడ ఏం జరుగుతోందో తెలుసుకోవాలని పోలీసు దగ్గరకు వెళ్లి అడిగాడు. అయితే, ఆ ప్రశ్నతో అనుమానం వ్యక్తం చేసిన పోలీసు అతని బ్యాగును చెక్ చేసి, ఆధార్ కార్డు ఫొటో తీసి, ఇంటి అడ్రస్ కూడా నమోదు చేసుకొని, తనని డిటైన్ చేశారని తెలిపాడు. ఈ విషయం '<a href="https://x.com/ShoaibDaniyal/status/2108841491070325241">X'</a> లోపోస్ట్ చేయగా వైరల్ గా మారింది.
