నామినేషన్లకు ఇవాళే చివరి రోజు.. పార్టీల్లో ఉత్కంఠ
ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి మున్సిపల్‌లో ఎన్నికల నామినేషన్ల గడువు నేటితో ముగియనుండటంతో రాజకీయ వేడి పెరిగింది. రెండో రోజు వివిధ పార్టీలకు చెందిన 16 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. వీరిలో TDP నుంచి 10 మంది, జనసేన నుంచి ఇద్దరు, CPM నుంచి ఇద్దరు, స్వతంత్రులు ఇద్దరు ఉన్నారు. అభ్యర్థుల ఎంపికపై పార్టీల్లో అసంతృప్తి, స్వతంత్రుల పోటీతో ప్రధాన పార్టీల్లో ఒత్తిడి నెలకొంది. నేడు నామినేషన్ల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.



