సీతానగరం అంకమ్మ తల్లి ఆలయంలో అన్నదానం

గుంటూరు జిల్లా తాడేపల్లి సీతానగరం గాంధీ బొమ్మ సెంటర్‌లోని శ్రీ వినుకొండ అంకమ్మ తల్లి ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. శనివారం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో టీడీపీ పట్టణ అధ్యక్షుడు వల్లభనేని వెంకట్రావు పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసి మహా నైవేద్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, భక్తులు పాల్గొన్నారు.




