← Back to news

'నవంబర్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి'

By K. VENKATESH· 20h ago· Khammam
'నవంబర్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి'

ఖమ్మం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. నిర్మాణాల్లో వేగం పెంచడంతో పాటు నాణ్యతలో రాజీ పడొద్దని స్పష్టం చేశారు. శనివారం కాల్వొడ్డు వద్ద నిర్మాణంలో ఉన్న తీగల వంతెన పనులను పరిశీలించారు. నవంబర్ చివరి నాటికి ప్రభుత్వ వైద్య కళాశాల భవనాలు, తీగల వంతెన నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.

'నవంబర్ చివరి నాటికి నిర్మాణాలు పూర్తి చేయాలి'

More in Local