దుర్గామాతకు MLA ప్రత్యేక పూజలు

వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం మైల్వార్ గ్రామంలో శ్రీదుర్గమాత నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా తాండూరు MLA బుయ్యని మనోహర్‌రెడ్డి దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాలు, బతుకమ్మ సంబరాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. భక్తులు, గ్రామస్థులు ఉత్సవాల్లో పాల్గొన్నారు.





