పుట్టపర్తిలో రేపు పీజీఆర్ఎస్ రద్దు

శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అక్టోబర్ 19న నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలు, మహర్నవమి పండుగ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రజలు అర్జీల సమర్పణ కోసం రెవెన్యూ భవన్‌కు రావద్దని, క్షేత్రస్థాయిలోనూ పీజీఆర్ఎస్ నిర్వహించబోమని స్పష్టం చేశారు.



