← Back to news

కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

By ORSU KRISHNA· 3h ago· Palnadu
కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి

పల్నాడు జిల్లా నరసరావుపేట ధర్నా చౌక్ వద్ద సోమవారం కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కరపత్రాలను ఆవిష్కరించారు. 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని, నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేసి 44 కార్మిక చట్టాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. మహిళలకు రాత్రి షిఫ్టులను ఎత్తివేయాలని కోరారు. విశాఖ స్టీల్ ప్లాంట్, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించారు. కార్మికులు, రైతులకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను ప్రజలంతా ఖండించాలని కార్మిక సంఘాల నాయకులు పిలుపునిచ్చారు.

More in Local