9 మందికి ఉచితంగా కంటి ఆపరేషన్లు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని పావని కంటి ఆసుపత్రిలో రోటరీ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 9 మంది నిరుపేదలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ఉచితంగా కంటి ఆపరేషన్లు నిర్వహించారు. శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి ఉచితంగా కంటి అద్దాలు, మందులు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా SC, ST మానిటరింగ్ కమిటీ సభ్యులు టీవీ సూర్యం, డాక్టర్ విజయ్, ఆసుపత్రి సిబ్బంది, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



