తిమ్మాపూర్ జట్టుకు క్రికెట్ లీగ్ టైటిల్!

జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన క్రికెట్ లీగ్ ఫైనల్ పోటీలు ఉత్సాహంగా ముగిశాయి. తిమ్మాపూర్ జట్టు విజేతగా, వర్షకొండ జట్టు రన్నరప్‌గా నిలిచాయి. ఎస్సై జి. నవీన్ కుమార్ విజేతలకు ₹10 వేల నగదు బహుమతి, రన్నరప్ జట్టుకు ₹5 వేల పురస్కారం అందజేశారు. క్రీడలు యువతలో శారీరక దృఢత్వం, స్నేహభావాన్ని పెంపొందిస్తాయని ఆయన తెలిపారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, యువకులు పాల్గొన్నారు.



