నెల్లూరు 72వ డివిజన్‌లో ప్రచారం

శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికల్లో 72వ డివిజన్ సీపీఎం అభ్యర్థి గజ్జె పరమేశ్వరి సోమవారం ఇంటింటి ప్రచారాన్ని ముమ్మరం చేశారు. డివిజన్ పరిధిలోని కాలనీలలో పర్యటిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. స్థానిక ప్రజలు, మహిళలను కలిసి సమస్యలు తెలుసుకుంటూ మద్దతు కోరడంతో వార్డులో ప్రచారం జోరందుకుంది. ఎన్నికల్లో ఆదరించాలని ప్రజలను కోరారు.



