← Back to news

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మాధురమ్మ ప్రత్యేక పూజలు

By Ramesh Kondru· 1d ago· Khammam
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మాధురమ్మ ప్రత్యేక పూజలు

ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గంలో దేవీ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సతీమణి మాధురమ్మ పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భవాని భక్త బృందంతో కలిసి కుంకుమార్చనలు చేశారు. పలు చోట్ల అన్నదాన కార్యక్రమాలను ప్రారంభించారు. మంత్రి పొంగులేటి నాయకత్వంలో పాలేరు నియోజకవర్గం మరింత అభివృద్ధి సాధించాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. ప్రజలందరికీ ముందస్తు దసరా శుభాకాంక్షలు చెప్పారు.

దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మాధురమ్మ ప్రత్యేక పూజలు
దేవీ నవరాత్రి ఉత్సవాల్లో మాధురమ్మ ప్రత్యేక పూజలు

More in Local