← Back to news

జూపేడ రోడ్డుపై ప్రయాణం ప్రమాదకరం

By Ramesh Kondru· 21h ago· Khammam

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలంలోని జూపేడ నుంచి రఘునాథపాలెం వెళ్లే రహదారి గుంతలమయంగా మారడంతో రైతులు, వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రహదారిపై ప్రయాణం ప్రమాదకరంగా మారిందని, రాత్రివేళల్లో మరింత అవస్థలు ఎదురవుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చొరవ తీసుకుని రహదారికి నిధులు మంజూరు చేసి, నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతున్నారు.

More in Local