DMLT, డయాలసిస్ కోర్సుల్లో ప్రవేశాలకు ఛాన్స్!

భద్రాద్రికొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలలో DMLT, D Dialysis Technician కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. తెలంగాణ పారామెడికల్ బోర్డు నోటిఫికేషన్ నంబర్ 152/TGPMB/Admissions/AY 2026-2027, తేదీ 14.10.2026 ప్రకారం ఒక్కో కోర్సులో 30 సీట్ల చొప్పున భర్తీ చేయనున్నారు. ఇంటర్ Bi.P.C పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల 24వ తేదీలోపు పూర్తి వివరాలతో దరఖాస్తులను కళాశాలలో అందజేయాలని కళాశాల ప్రిన్సిపాల్ శ్రీహరి రావు తెలిపారు.




