← Back to news

చిలువూరులో గంగానమ్మ వార్షికోత్సవ వేడుకలు

By KUCHIPUDI BUJJIBABU· 1d ago· Guntur

గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం చిలువూరులో గంగానమ్మ 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. చిలువూరులో గ్రామస్తుల ఆధ్వర్యంలో రంగిశెట్టి ఫౌండేషన్, బయోఫర్ ఫార్మా అధినేత డాక్టర్ రంగిశెట్టి జగదీష్ బాబు సహకారంతో మూడు రోజులపాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఆదివారం రెండో రోజు రంగిశెట్టి స్వగృహం నుంచి డప్పులు, కనకతప్పెట్లు, మంగళవాయిద్యాల నడుమ పొంగళ్లతో ఊరేగింపు నిర్వహించి అమ్మవారికి సమర్పించారు. అనంతరం పసుపు, కుంకుమ జలాలతో అభిషేకం చేశారు.

More in Local