← Back to news

కలెక్టర్ చొరవతో డిగ్రీ కాలేజీకి నిధులు

By Prabhakar Be happy· 19h ago· Narayanpet
కలెక్టర్ చొరవతో డిగ్రీ కాలేజీకి నిధులు

నారాయణపేట జిల్లా మక్తల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రయోగశాల పరికరాల కొనుగోలుకు కలెక్టర్ CH. ప్రియాంక ప్రత్యేక చొరవ తీసుకున్నారు. డీఎంఎఫ్‌టీ నిధుల నుంచి ₹6,82,462 మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, కళాశాల అభివృద్ధికి సహకరించిన కలెక్టర్‌కు ప్రిన్సిపాల్ ఇ. నారాయణగౌడ్ కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా, పారదర్శకంగా త్వరలో పరికరాలు కొనుగోలు చేస్తామని తెలిపారు.

More in Local