← Back to news

ఉపేందర్ రెడ్డి విజయాన్ని కోరుతూ శబరిమల యాత్ర

By YSR· 1d ago· Khammam

ఖమ్మం జిల్లా పాలేరు మాజీ MLA కందాళ ఉపేందర్ రెడ్డి మళ్లీ పాలేరు ఎమ్మెల్యేగా విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ఏదులాపురం మున్సిపాలిటీ పరిధి పెద్దతండాకు చెందిన బానోత్ వీరన్న స్వామి అయ్యప్ప స్వామివారిని ప్రార్థించారు. ఈ సందర్భంగా శబరిమలలోని పంబా నది నుంచి అయ్యప్ప ఆలయం వరకు మెట్ల మార్గంలో ఫ్లెక్సీని చేతబట్టి కొండపైకి ఎక్కారు. రాబోయే ఎన్నికల్లో ఉపేందర్ రెడ్డి గెలవాలని కోరుతూ తన అభిమానాన్ని, భక్తిని చాటుకున్నారు.

More in Local