నామినేషన్ కోసం ఎస్సై కాళ్లు పట్టుకున్న అభ్యర్థి!
అనంతపురం జిల్లా గుత్తిలో నామినేషన్ల వ్యవహారం ఉద్రిక్తతకు దారితీసింది. YSRCP కౌన్సిలర్ అభ్యర్థి రంగస్వామి నామినేషన్ వేయకుండా TDP నేతలు అడ్డుకున్నారని ఆ పార్టీ నాయకులు ఆరోపించారు. నామినేషన్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ రంగస్వామి SI కాళ్లు పట్టుకున్న ఘటన చర్చనీయాంశమైంది. ఈ ఘటనను నిరసిస్తూ వైఎస్సార్‌సీపీ నేతలు ధర్నా చేపట్టారు.



