← Back to news

పూల కొనుగోళ్లతో మందమర్రిలో పండుగ సందడి

By Bala· 23h ago
పూల కొనుగోళ్లతో మందమర్రిలో పండుగ సందడి

సద్దుల బతుకమ్మ పండుగ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా మందమర్రి మార్కెట్‌లో పూల విక్రయాలు జోరందుకున్నాయి. ఆదివారం ఉదయం నుంచే మహిళలు పెద్దసంఖ్యలో మార్కెట్‌కు చేరుకుని తంగేడు, గునుగు, సీతమ్మజడలు, బంతి, చామంతి, అల్లి తదితర పూలను కొనుగోలు చేస్తున్నారు. వివిధ గ్రామాల నుంచి వ్యాపారులు పూలను తీసుకొచ్చి విక్రయిస్తుండటంతో మార్కెట్‌ ప్రాంతం కొనుగోలుదారులతో కిటకిటలాడుతోంది. పూల కొనుగోళ్లతో పట్టణంలో పండుగ సందడి నెలకొంది.

More in Local