ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు: SP

పల్నాడు జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో సెక్షన్ 163 BNSS, సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నాయని జిల్లా SP జగదీష్ ఆదహళ్లి తెలిపారు. బహిరంగ సభలు, ఊరేగింపులు, రోడ్‌షోలు నిర్వహించాలన్నా, మైకులు, డ్రోన్ కెమెరాలు వినియోగించాలన్నా ముందస్తు అనుమతి తప్పనిసరని స్పష్టం చేశారు. ఆయుధాలు, ప్రమాదకర వస్తువులతో తిరగడం, నిబంధనలకు విరుద్ధంగా గుమిగూడటం నిషేధమన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరూ సహకరించాలని కోరారు.



