← Back to news

నిధుల మళ్లింపు ఆరోపణలపై మౌనం ఎందుకు?

By Md Jabeer· 1d ago· నిర్మల్ జిల్లా
నిధుల మళ్లింపు ఆరోపణలపై మౌనం ఎందుకు?

నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) పంచాయతీకి చెందిన SBM (స్వచ్ఛ భారత్ మిషన్) నిధులను నిబంధనలకు విరుద్ధంగా గొల్లమడ GP కంప్యూటర్ ఆపరేటర్ల అకౌంట్‌లో వేసి, అనంతరం నర్సాపూర్ కార్యదర్శి అకౌంట్‌కు మళ్లించారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంలో ఇప్పటివరకు చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు విమర్శలు చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్నారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రజాసంఘాలు, గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.

నిధుల మళ్లింపు ఆరోపణలపై మౌనం ఎందుకు?
నిధుల మళ్లింపు ఆరోపణలపై మౌనం ఎందుకు?

More in Local