← Back to news

జనసేన ఆశావహులకు చెట్టి చిరంజీవి పిలుపు

By B V Appalanaidu· 1d ago· Alluri Sitharama Raju
జనసేన ఆశావహులకు చెట్టి చిరంజీవి పిలుపు

అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు నియోజకవర్గంలో జనసేన తరఫున ZPTC, MPTC స్థానాలకు పోటీ చేయాలనుకునే ఆశావహులు సోమవారం ఉదయం 10గంటలకు గుడ్ మార్నింగ్ రిసార్ట్‌లో జరిగే సమావేశానికి హాజరుకావాలని పార్టీ ఇన్‌చార్జి చెట్టి చిరంజీవి పిలుపునిచ్చారు. MLC నాగబాబు ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. పోటీ చేయాలనుకునే ఆశావహులు తమ దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఇప్పటికే దరఖాస్తులు అందించిన వారి అభ్యర్థిత్వాలను కూడా పరిగణనలోకి తీసుకుంటామని స్పష్టంచేశారు.

More in Local