గ్రామీణ మహిళలకు అందని ఆరోగ్య అవగాహన

రుతువిరతి (మెనోపాజ్) సమయంలో మహిళలు ఎదుర్కొనే ఆరోగ్య సమస్యలపై అవగాహన పెంచాల్సిన అవసరం ఉంది. హార్మోన్ల మార్పులతో వచ్చే శారీరక, మానసిక ఇబ్బందులపై గ్రామీణ మహిళలకు సరైన సమాచారం అందడం లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. వరంగల్ జిల్లాలోని మహిళలు PHCల్లో ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి, ఉచిత పరీక్షలు, కౌన్సెలింగ్ అందించాలని కోరుతున్నారు. ఆశా కార్యకర్తల ద్వారా ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. నేడు ప్రపంచ మెనోపాజ్ దినోత్సవం.



