← Back to news

బావి నీటితోనే దాహం తీర్చుకుంటున్న గ్రామస్థులు

By Y. Srinivasarao· 1d ago· Khammam
బావి నీటితోనే దాహం తీర్చుకుంటున్న గ్రామస్థులు

ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండల పరిధిలోని ఎనుకుంట తండా గ్రామస్థులు తాగునీటి సమస్యతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్పంచ్, కార్యదర్శి పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బావిలోని కలుషిత నీటినే తాగునీరుగా ఉపయోగించాల్సి వస్తోందని వాపోతున్నారు. దీంతో అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తండాలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గ్రామస్థులు కోరుతున్నారు.

More in Local