నర్సంపేటలో ప్రత్యేక ఆకర్షణగా సోమనాథ్ టెంపుల్

వరంగల్ జిల్లా నర్సంపేటలో సద్దుల బతుకమ్మ వేడుకలకు ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా స్థానిక కూరగాయల మార్కెట్ మైదానాన్ని మల్టీకలర్ లైటింగ్‌తో ఆకర్షణీయంగా అలంకరించారు. వేడుకల ప్రాంగణానికి ఏర్పాటు చేసిన ప్రధాన ద్వారం వద్ద గుజరాత్‌లోని ప్రసిద్ధ సోమనాథ్ టెంపుల్ గోపురం నమూనాను ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. భక్తిశ్రద్ధలతో జరిగే సద్దుల బతుకమ్మ వేడుకల కోసం చేసిన ఈ ఏర్పాట్లు పట్టణ ప్రజలను ఆకట్టుకుంటున్నాయి.



